దేశంలో సీపీఐ పాత్రలేని పోరాటం లేదని, ఎర్రజెండాను ఎవరు అంతం చేయలేరని సీపీఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు అన్నారు. ఆదివారం వనపర్తి సీపీఐ ఆఫీస్ లో వనపర్తి టౌన్ మహాసభ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి కే విజయరాములు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దేశంలో సీపీఐ ఆవిర్భవించిన వందేళ్ళలో దేశ స్వాతంత్రం కోసం, తెలంగాణ విముక్తి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీపీఐ పోరాడి విజయం సాధించింది అన్నారు.