సామాన్య ప్రజలకు, న్యాయ సేవాధికార సంస్థలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి పార లీగల్ వాలంటీర్లు ఎంతగానో ఉపయోగపడతారని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో పార లీగల్ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లీగల్ వాలంటీర్ల ద్వారా న్యాయ సహాయం అన్ని వర్గాల ప్రజలకు అందుతుందన్నారు.