వనపర్తి: విమాన ప్రయాణ మృతులకు అశ్రు నివాళి: గణేష్ వాకింగ్ టీం

56చూసినవారు
వనపర్తి: విమాన ప్రయాణ మృతులకు అశ్రు నివాళి: గణేష్ వాకింగ్ టీం
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి వనపర్తిలో గణేష్ వాకింగ్ టీం అశ్రునివాళి అర్పించింది. టీం ప్రెసిడెంట్ వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభావం వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్