అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తున్న బీజేపీని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆదరించాలని బీజేపీ వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షుడు బచ్చు రాము పేర్కొన్నారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం వనపర్తి పట్టణంలోని 33 వ వార్డులో కేంద్రంలో మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆరు హామీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ప్రజలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు.