కాంగ్రెస్ ఏడాది పాలన అంతా అసమర్థ, అవినీతితో కొనసాగిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శనివారం వనపర్తి లోని నిరంజన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థత వల్ల రైతులకు యాసంగికి సాగునీళ్ళు ఇవ్వడం లేదని, కేసీఆర్ హయాంలో ఒక లక్ష 24వేల ఎకరాలకు వానాకాలం, యాసంగికి నీళ్ళు ఇచ్చామని గుర్తు చేశారు.