గుడ్డులోని తెల్లసోనను ముఖంపై పూతలా వేసుకోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ముఖంపై వచ్చే ముడతలు, సన్నటి గీతలు రాకుండా ఉంటాయి. మొటిమల సమస్యకు, జిడ్డు చర్మం ఉన్నవారికి గుడ్డు చక్కగా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి. గుడ్డు వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుతుందని వైద్యులు వివరిస్తున్నారు.