కొందరికి శరీరంలో ఎక్కువగా వేడి ఉంటుంది. దీనివల్ల కాళ్ల మంటలు, పగుళ్లు, కళ్లలో నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి బయట పడేందుకు సొరకాయ ఎంతో హెల్ప్ చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా సొరకాయ చాలా మంచిదట. అంతేకాకుండా లివర్ సమస్యలను దూరం చేసేందుకు ఇది సహాయపడుతుంది. అందుకే వారంలో ఒక్కసారైనా సొరకాయను తినాలని డాక్టర్లు చెబుతున్నారు.