శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదు: రష్మిక

79చూసినవారు
శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదు: రష్మిక
శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని రష్మిక అన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్ని కాంక్షించే వారిగా పేర్కొనొద్దు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది బాధ్యతే అవుతుంది. మనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్