జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ చట్ట సవరణపై గతంలో కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 14 సవరణలతో తుది నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను కొద్దిసేపటి క్రితం లోక్ సభ స్పీకర్‌కు JPC చైర్మన్ జగదాంబికాపాల్ అందజేశారు.