ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. భారతీయులకు అడ్వైజరీ జారీ

76చూసినవారు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. భారతీయులకు అడ్వైజరీ జారీ
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయట ప్రయాణించవద్దని, ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి, స్థానిక నిబంధనలు పాటించాలని కోరింది.

సంబంధిత పోస్ట్