ఇజ్రాయెల్ దాడులు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేశాయి. ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మధ్య ప్రాచ్యంలో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఐక్యరాష్ట్ర సమితి సహా అనేక దేశాలు ఈ ఘర్షణను శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతున్నాయి. చమురు సరఫరాలో ఇరాన్ కీలక దేశం కావడంతో.. ఈ ఉద్రిక్తతలు చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.