యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదు: ప్రధాని మోదీ

84చూసినవారు
యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదు: ప్రధాని మోదీ
ప్రపంచ దేశాల సమస్యలు చర్చలతో, దౌత్య మార్గంలోనే పరిష్కృతం అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదన్నారు. ఆస్ట్రియా పర్యటన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడో టర్మ్ ఆరంభంలోనే ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రియన్ ఛాన్సెలర్ కార్ల్ నెహమ్మర్‌తో పునరుత్పాదకశక్తి, మౌలికవసతులు, నీటి నిర్వహణ మొదలైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్