TG: వరంగల్ రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై చర్యలు తీసుకుంది. తాజాగా వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటు వేసింది. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ ఇంఛార్జ్ డీటీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.