భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునగడానికి శనివారం ఒక్క రోజు సుమారు 3 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దైవ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పట్టినట్లు భక్తులు తెలుపుతున్నారు.