భూపాలపల్లి జిల్లాలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమస్యల వినతులు స్వీకరించారు. సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 36 వివిధ రకాల దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.