తేలుకాటుతో యువకుడు మృతి

75చూసినవారు
తేలుకాటుతో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామానికి చెందిన దేవేందర్ అనే యువకుడు తేలుకాటుకు గురయ్యాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. మూడు గంటలు చికిత్స అనంతరం వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం కు రిఫర్ చేయడంతో ఆందోళన చెంది, ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ దేవేందర్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్