జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహా ముత్తారం మండలం పెగడపల్లి రేంజ్ పరిధిలోని యత్నారం అటవీ ప్రాంతంలో సోమవారం ఎలుగుబంటి కళేబరం కలకలం రేపింది. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు వేసిన విద్యుత్ తీగకు తగిలి చనిపోయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంటి మాంసాన్ని కొంతమేర వెటగాళ్లు తీసుకువెళ్లారు. ఎలుగుబంటి కాలి గోర్లను నరికి తీసుకువెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.