తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్‌తో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.