అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగంపెల్లి ప్రసాద్ రావు, జన్నే మొగిలి, దుప్పటి భద్రయ్య, దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.