భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐటి మాస్టర్ క్యాంపస్ లో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు టియూడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్షుడు ఖ్యాతం సతీష్ కుమార్, కార్యదర్శి సామంతుల శ్యామ్ తెలిపారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు రక్తం అందించడం కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సకల జనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు.