10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఆంగ్ల భాషలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) వారు ప్రిపేర్ చేసిన ఐ పాస్ పుస్తకాన్ని శుక్రవారం భూపాలపల్లి జిల్లా డీఈఒ రాజేందర్ ఆవిష్కరించారు. డీఈఒ మాట్లాడుతూ ఈ పుస్తకం విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమలో ఎల్టా జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.