భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక సన్ వ్యాలీ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు భోగి పళ్లు పోసి రంగ వల్లులతో, హరిదాసులతో, భోగిమంటలతో, వివిధ రకాల నృత్య ప్రదర్శనలు చేస్తూ, గాలిపటాలు ఎగురవేస్తూ పండుగ వాతావరణం నెలకొల్పారు. పాఠశాల కరస్పాండెంట్ మైనాల సురేష్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు.