సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గండ్ర మాట్లాడుతూ మహిళల అభ్యుదయం కోసం, వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి ఫూలే అని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్, తదితరులు పాల్గొన్నారు.