కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ఆదివారం నుంచి హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. కన్నెపల్లిలోని లక్ష్మీ వంపుహౌస్ వద్ద భక్తులు విహాంగ వీక్షణం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ జాయ్ రైడ్ కోసం yatradham. org యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. అలాగే టెంట్ సిటీ, దేవస్థానం పూజల సమాచారం ఈ యాప్లో పొందుపర్చినట్లు వివరించారు. రైడ్ బుకింగ్ కోసం ఒక్కరికి రూ. 4, 500 ఛార్జీ చేయనున్నారు.