భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డికాలనీ పేస్ - 1 లో మంగళవారం సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులు రెడ్డికాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.