కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఫ్లెక్సీ రూపంలో బీజేపీ భూపాలపల్లి జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎగ్జిబిషన్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు అల్లాపూర్ శ్రీనివాసరావు, కందుల సంధ్యారాణి, నాగపురి రాజమౌళి గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఊహించని పురోగతి సాధించిందని అన్నారు.