ఆడపిల్లని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అమె సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ, సభ్యులు అర్జున్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.