జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు భూపాలపల్లి ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డిలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే ఆయన చేసిన సేవలను కొనియాడారు.