కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని చైతన్య భారతి విద్యాలయంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. గురువారం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ మాట్లాడుతూ అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదని అన్నారు. ఏ రంగంలో ఉద్యోగిని అయిన తీర్చిదిద్దే ఘనత ఒక్క ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు.