భూపాలపల్లి జిల్లాలోని మలహార్ మండలం తడ్వాయి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు లో భాగంగా మంగళవారం గ్రామంలో రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రైతులు దరఖాస్తుతో హాజరై వారి భూ సమస్యను రెవెన్యూ అధికారులకు వివరించారు. అధికారులు మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలను దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.