వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని గత ప్రభుత్వం 81, 85 జీవోని జారీ చేసింది. కానీ 18 నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వలేదని బుధవారం వీఆర్ఏ వారసుల రాష్ట్ర జేఏసీ నాయకులు చెన్నపురి హరీష్ ప్రభుత్వ తీరును ఖండించారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏ వారసులు సమస్యల మీద మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లడం జరిగింది. దీంతో పోలీసులు వారిని అక్రమ అరెస్టులు చేసారని, ఈ అరెస్టులను తీవ్రంగా కండిస్తున్నామన్నారు.