సి. ఎం. ఆర్ లక్ష్యాలను నూరు శాతం సాధించాలని భూపాలపల్లి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మిల్లర్లను ఆదేశించారు. సోమవారం సిఎంఆర్, ఖరీఫ్ దాన్యం కేటాయింపు, మిల్లులు ట్యాగింగ్, మార్కెట్ కమిటీ లైసెన్సులు తదితర అంశాలపై పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార శాఖ, రైస్ మిల్లర్లుతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు సి ఎం ఆర్ లక్ష్యం 77. 46 శాతం పూర్తిచేశామని, మిగిలిన లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు.