రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కాళేశ్వరం చేరుకున్నారు. త్రివేణి సంగమం వద్ద వేద పండితులు, మంత్రులు మంత్రి శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీఎం కి స్వాగతం పలికారు. సీఎం పుష్కర స్నానమాచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక పూజల్లో పాల్గొన్నారు.