పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుఅన్నారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. చిట్యాల మండల కేంద్రంతో పాటు ఒడితల, పాశిగడ్డతండా, గోపాలపురం, కొత్తపేట, బావుసింగ్ పల్లి, జడలపేట, వరికోల్ పల్లి, నైన్ పాక, చల్లగరిగ గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.