సీఎం రేవంత్‌రెడ్డి కాసేపట్లో కాళేశ్వరం దేవాలయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి చేరుకుని జ్ఞాన సరస్వతి పుష్కరఘాట్ వద్ద పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. అనంతరం సరస్వతి మాత విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు. సాయంకాలం సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో వేద మంత్రోచ్చారణ మధ్య సరస్వతి నదికి సప్త హారతులు కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. కాగా, గురువారం ఉదయం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి.