భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ అయ్యాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలపై నజర్ వేసి, కూల్చివేస్తున్నారు. ఓ సర్వే నంబర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఘటన స్థలానికి చేరుకుని డోజర్ తో ఇల్లు కూల్చివేశారు. బాధిత ఇంటి యజమాని ఆందోళన చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.