కాళేశ్వరం లో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో మొదటి రోజు గురువారం భక్తుల సందడి ఆశించినంతగా లేదు. ఎండ తీవ్రత కు, సీఎం పర్యటన ఉండడంతో పుష్కర ఆరంభ స్నానాలపై భక్తులు ఆసక్తి కనబరచలేదు. వాహనాలను ఘాట్ లకు దూరంగా నిలిపివేయడంతో భక్తులు అవస్తలు పడ్డారు. అధికారులు 50 వేల నుండి లక్ష వరకు భక్తులు వస్తారని అంచనా వేయగా దాదాపుగా 20వేల మంది భక్తులు మాత్రమే హాజరయ్యారు.