భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని కేజిబీవి పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు. హరిదాసులు, బసవన్నల వేషధారణలో పిల్లలు అలరించారు. రంగవల్లులు, బొమ్మల కొలువు భోగిమంటలు, భోగిపళ్లు కోడిపందేలు, గాలిపటాలు ఎగరవేసి, పిండి వంటలు సకినాలు పోసి, సంక్రాంతి పండుగ విశిష్టత తెలిపే పాటలపై నృత్యాలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.