భూపాలపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పట్టాలు అందజేయాలని, జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టాలు అందివ్వకపోవడంతో లబ్ధిదాలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.