భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ఆయా గ్రామాలల్లో రూ. 9. 10 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గోపాలపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ, గోపాలపూర్ నుండి శ్యామ్ నగర్ వరకు బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.