భూపాలపల్లి ప్రాంతానికి చెందిన యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య చాటింగ్, ఫోన్లో మాట్లాడుకోవడంతో పరిచయం మరింత బలపడింది. యువకుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి గత నెల 15న యువతిని నమ్మించి కారులో వరంగల్ నగరానికి తీసుకొచ్చాడు. హోటల్లో రూమ్ అద్దెకు తీసుకొని యువతికి బీర్లు తాగించి ఇద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి ఇంతెజార్ంజ్ పీఎస్లో కేసు నమోదైంది