కాటారం: తాళం వేసిన ఇంట్లో చోరీ

52చూసినవారు
కాటారం: తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన భూపాలపల్లి జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది. కాటారం మండలం గంగారానికి చెందిన వృద్ధురాలు సంతోషం గౌరక్క మహా ముత్తారం మండలంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు బుధవారం వెళ్లింది. శనివారం ఇంటికి వచ్చి తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా బీరువా పగలగొట్టి ఉండటంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వారికి చెప్పింది. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం చోరీ జరిగిన ప్రదేశాన్ని, వస్తువులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్