నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్

56చూసినవారు
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు హాజరుకానున్నారు. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో న్యాయ విచారణ కమిషన్‌ కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. కాగా ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్