భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆదివారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. 42 ఏళ్ల తర్వాత కాళేశ్వర ముక్తేశ్వరుడికి ఈ మహా కుంభాభిషేకం జరిగిందని అర్చకులు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి పర్యవేక్షణలో ఈ కుంభాభిషేకం జరిగింది. చివరిసారిగా 1984లో ఈ కుంభాభిషేకం ఉత్సవాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.