జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మంగళవారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించారు. అనంతరం దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా, సుఖశాంతులతో మెలగాలని ఆయన కోరారు.