భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంగిడిపల్లి గ్రామంలోని అంగన్వాడి - 2 సెంటర్లో బుధవారం జిల్లా సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్ బిర్యానీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పిల్లలకు ఎమ్మెల్యే ఎగ్ బిర్యానీ ని వడ్డించారు. అంతకుముందు సుబ్బక్కపల్లి గ్రామంలో అమ్మమాట - అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.