సరస్వతి పుష్కరాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్ తెలిపారు. మంగళవారం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి విఐపి ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, భక్తులు పుష్కర స్నానాలు చేయు నది త్రివేణి సంగమం, గోదావరి ఘాట్, దేవాలయం, బందోబస్తు ప్రణాళిక తదితర రక్షణ ఏర్పాట్లు పరిశీలించారు.