ప్రభుత్వం గత 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మైనార్టీ స్కూల్ బిల్డింగ్ యజమాని దేవేందర్ రెడ్డి మంగళవారం
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి నెలకొంది. 340 మంది విద్యార్థులు మైనార్టీ పాఠశాలలో చదువుచున్నారు. సిబ్బంది, ఉపాధ్యాయులు స్కూల్ కి వచ్చేసరికి తాళం వేసి ఉండేసరికి ఒక్కసారిగా కంగుతిన్నారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.