భూపాలపల్లి కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ పాలకమండలి నియామకానికి రీ నోటిఫికేషన్ను గురువారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 26వ తేదీ వరకు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. వివరాలకు కాళేశ్వరం దేవస్థానంలో సంప్రదించాలని పేర్కొన్నారు. దేవస్థానం పాలకమండలి గడువు గతేడాది మార్చి 14న ముగిసింది. ఆగస్టు 30న పాలకమండలి నియామకానికి నోటిఫికేషన్ వెలుబడింది.