మహాలక్ష్మి పథకంతో మహిళలు భారీగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రానికి తరలివస్తున్నారు. కార్తీకమాసం ప్రారంభమై నాటి నుంచి నిత్యం మహిళలతో బస్సులు కిక్కిరిసి వస్తున్నాయి. కార్తీకమాసం చివరి రోజు శనివారం రాత్రి ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసి ఉండగా బస్సు రావడమే ఆలస్యం పరుగులు పెట్టి సీట్లు దక్కించుకుంటున్నారు. అయినా చాలా మంది బస్సులు రాక కోసం నిరీక్షిస్తూ కరుణించు మహాలక్ష్మి అని వేడుకున్నారు.